telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

నేటి నుండి పెరిగిన హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు నేటి నుంచి పెరిగాయి. కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 12కు గరిష్ఠ టికెట్ ధర రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు. ఇలా కనిష్ఠంగా రూ.2, గరిష్ఠంగా రూ.16 వరకు ఛార్జీలు పెంచామని ఎల్ అండ్ టీ ప్రకటించింది.

పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా మెట్రో ఛార్జీలు పెంచినట్లు సమాచారం.

కరోనా మహమ్మారి కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల మెట్రో నష్టాల్లో కూరుకుపోయిందని గతంలోనే మెట్రో అధికారులు వెల్లడించారు.

దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా మెట్రో రైలు ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది.

దీంతో ఛార్జీలు పెంపు ఒక్కటే మార్గంగా మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ఈ ఛార్జీల పెంపు వల్ల మెట్రో రైలు సంస్థకు అదనంగా రూ.150 – రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.

Related posts