telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

భారీ బందోబస్తు మధ్య.. ఉప్పల్ స్టేడియం.. భారత్-వెస్టిండీస్ తొలి టీ20…

huge security in uppal stadium

నేడు భారత్-వెస్టిండీస్ సిరీస్ లో భాగంగా మొదటి టీ20 ఉప్పల్ స్టేడియం లో జరుగుతుంది. ఇప్పటికే స్టేడియం సిద్ధమవడంతో ఫ్యాన్స్ మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. స్టేడియంలోని అవుట్ ఫీల్డ్ తో పాటు 30 యార్డ్ సర్కిల్ వీఐపి గ్యాలరీ, అభిమానులు కూర్చోని వీక్షించేందుకు అన్ని గ్యాలరీస్, పావలిన్ ఎండ్స్ లలో భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. 40వేల మంది అభిమానులు వీక్షించే కెపాసిటి ఉన్న రాజీవ్ గాంధీ స్టేడియంలో రాచకొండ పోలీసులు భారీ స్ధాయిలో భద్రత ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 6 బ్లాక్ డే కావడంతో… ఉప్పల్ స్టేడియంలోని 12గేట్ల వద్ద పోలిసుల బందోబస్తు ఏర్పాటైంది.. ఉప్పల్ స్టేడియంలో మొత్తం 300 అత్యాధునిక సిసి కెమరాలు అందుబాటులో ఉన్నాయి. సౌత్ స్టాండ్ వద్ద జాయింట్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన పోలీసులు ఎప్పటికప్పుడు పరీస్థితిని సమీక్షిస్తున్నారు.

లాప్ టాప్స్, స్టిల్ కెమెరాలు, హెడ్ ఫోన్స్, లిక్కర్, వాటర్ బాటిల్స్, మాట్చ్ బాక్స్ తో పాటు కొన్ని వస్తువులను స్టేడియంలోకి తీసుకు రావద్దంటూ ఆంక్షలు విధించారు. టీమ్‌లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకపోవడం వెస్టిండీస్‌కు సమస్యగా మారింది. ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన రసెల్‌ సహా, బ్రాత్‌వైట్, బ్రేవోలు లేకుండానే వెస్టిండీస్‌ యువ ఆటగాళ్లతో భారత్‌కు వచ్చింది. బాల్‌ ట్యాంపరింగ్‌తో హిట్టర్‌ నికోలస్‌ పూరన్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో కరేబియన్లు ఓపెనర్లు ఎవిన్‌ లూయిస్, లెండిల్‌ సిమన్స్, హెట్‌మైర్, కెప్టెన్‌ పొలార్డ్‌లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక బౌలర్ల విషయానికొస్తే హోల్డర్, కీమో పాల్, కాట్రెల్‌లపై జట్టు నమ్మకం పెట్టుకుంది. భారత్‌లో ఆడిన అనుభవం తమకు వుందని, యువసత్తాతోనే కోహ్లిసేను ఓడిస్తామని పొలార్డ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

Related posts