ఈ మద్య కాలంలో ఇంట్లో తినకుండా.. చాలా మంది బయటి ఫుడ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కొందరు ఇంట్లో వండుకునే టైమ్ లేక ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ చేస్తుంటే.. మరీకొందరు టైమ్ పాస్ కు బయట ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. అయితే బయటి ఫుడ్ వల్ల అనేక నష్టాలు ఉన్నాయి…ఉంటాయి కూడా. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. హైదరాబాద్ లోని నాచారంలో ఆన్లైన్ ఆర్డర్ తీవ్ర విషాదం నింపింది. ఐస్ క్రీమ్ తిని సంపత్ అనే యువకుడు మృతి చెందాడు. స్విగ్గీలో స్కూబ్స్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిన సంపత్.. కేజీ ఐస్ క్రీమ్ లో కొద్దిగా ఉంచి మిగతాది మొత్తం తినేశాడు సంపత్. అయితే ఆ ఐస్ క్రీమ్ తిన్న కాసేపటికే వాంతులు, విరోచనాలు అయ్యాయి. ఇక పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు సంపత్. దీంతో సంపత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సంపత్ బంధువుల సమాచారంతో.. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. సంపత్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.