telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

హైదరాబాద్ : .. జీహెచ్ఎంసీ కమిషనర్ వాహనంపై .. పేరుకుపోయిన చలాన్లు.. వైరల్ ..

huge challan pending on ghmc commissioner vehicle

నీతులు చెప్పడానికే, పాటించడానికి కాదనేది మరోసారి నిజమైంది. ట్రాఫిక్ ఉన్నత అధికారి వాహనంపైనే బోలెడు చలానాలు పేరుకుపోయి ఉన్నాయి. ఎవరు చలానాల బారిన పడకుండా నిబంధనలు పాటించాలి.. అని చెప్పే అధికారులే ఇలాంటి స్థితిలో ఉంటె, మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారో చెప్పాల్సినపనేలేదు. అయితే ఈ విషయం ఎలా బయటకు వచ్చిందో కానీ, అప్పటి నుండి సామజిక మాధ్యమాలలో సదరు అధికారి తాట తీసేస్తున్నారు నెటిజన్లు.

నగరంలోని జీహెచ్ఎంసీ కమిషనర్ కు చెందిన వాహనంపై చలాన్లు భారీగా పెండింగ్ లో ఉన్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ కారు (టీఎస్ 09ఎఫ్ఏ 4248) ఓవర్ స్పీడ్ తో వెళ్లినందుకు ట్రాఫిక్ సిబ్బంది చలాన్లు విధించారు. ఇప్పటివరకు ఆరు సార్లు అతివేగంతో ప్రయాణించినట్టు రికార్డయింది. 2018 నుంచి ఈ కారుపై మొత్తం రూ.6,210 జరిమానా విధించారు. నెటిజన్ల కారణంగా ఈ విషయం సోషల్ మీడియాలో హైలైట్ కావడంతో జీహెచ్ఎంసీ వర్గాలు వెంటనే జరిమానా మొత్తాన్ని చెల్లించేశాయి. ఈ విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఓవర్ స్పీడ్ ఎందుకు అంటూ డ్రైవర్ ను మందలించడం కొసమెరుపు.

Related posts