జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లకు అదనపు పరిహారం చెల్లిస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటనను వెంటనే అమలు పరుస్తూ 2060 ఇళ్లకు సంబంధించి రూ. 25 కోట్లను ప్రకటించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
పూర్తిగా దెబ్బతిన్న ఇంటికి రూ. 2 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ. 1 లక్ష చొప్పున అదనపు పరిహారం ఇస్తామన్న ప్రధానమంత్రి మోదీ ప్రత్యేక ప్రకటనను వెంటనే అమలు చేసింది హోం మంత్రిత్వ శాఖ.
పంజాబ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా పరిహారం అందించనుంది కేంద్ర ప్రభుత్వం 2025 మే 29, 30లలో కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా పూంచ్‌ను సందర్శించారు.
సరిహద్దు కాల్పుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన 14 మంది కుటుంబ సభ్యులకు ఆయన కారుణ్య ప్రాతిపదికన చేపట్టిన నియామక పత్రాలను అందజేశారు.
ప్రధాని పర్యటనకు రాకపోవడం దారుణం: పురంధేశ్వరీ