ఏపీ సచివాలయంలోని 2వ బ్లాక్ లో అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి అనిత.
అనంతరం అనిత మీడియా తో మాట్లాడారు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించారు అని అన్నారు.
ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లోనే ఘటనా స్థలంలో మంటలను అదుపులోకి తెచ్చారు. జీఏడీ, సీఆర్డీఏ శాఖలు ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నాయి.
ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నాం, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలాన్ని పరిశీలించి నివేదిక ఇస్తారు నివేదికను బట్టి తగు చర్యలు తీసుకుంటాం అన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటాం అని హోంమంత్రి అనిత అన్నారు.
తెలంగాణ వ్యతిరేకులకే మేలు జరుగుతుంది: విజయశాంతి