telugu navyamedia
సినిమా వార్తలు

బీజేపీపై స్టార్ హీరో ఘాటు వ్యాఖ్యలు… ఇంటికి పార్శిల్ పంపిన కార్యకర్తలు

Vijay

త‌మిళ అగ్ర హీరో విజ‌య్ ఇంటికి తిరుపూర్‌కి చెందిన బీజేపీ కార్య‌కర్త‌లు కాషాయ వ‌స్త్రాలు పంపారు. ఇటీవ‌ల ఓ సినీ వేడుక‌లో పాల్గొన్న ఆయ‌న బీజేపీని ప‌రోక్షంగా విమ‌ర్శించారు. సినిమాను పైర‌సీదారుల నుండి ఎం.జి.ఆర్ మాత్ర‌మే కాపాడ‌గ‌ల‌రు అన్నారు. పైర‌సీదారుల‌కు రాజ‌కీయ‌వాదులే అండ‌గా నిల‌బ‌డుతున్నారు. ఎన్నిక‌ల రిజ‌ల్ట్ త‌ర్వాత మ‌నం కాషాయ వ‌స్త్రాలు చుట్టుకుని తిర‌గాల్సిన ప‌రిస్థితి అంటూ ప‌రోక్షంగా బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. దాంతో తిరుపూర్‌కు చెందిన బీజేపీ యువ విభాగం విజ‌య్ ఇంటికి కాషాయ వ‌స్త్రాల‌ను, ఓ లేఖను పంపింది. అందులో ఇప్పుడు మొద‌టిసారి కాషాయ వ‌స్త్రాల‌ను పంపుతున్నాం. ఇక‌పై ఇంకా పంపుతాం. ఎందుకంటే మీరు కాషాయ వ‌స్త్రాల‌ను క‌ట్టుకుని తిర‌గాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఓ స్టార్ హీరో ఇంటికి కొంత మంది బీజేపీ కార్య‌క‌ర్త‌లు కాషాయ వస్త్రాలను పంపండం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Related posts