హీరో సిద్దార్థ్ బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయ్యాడు. తమిళ హీరో అయిన తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కొన్నేళ్ళు మంచి హిట్ లేక సినిమాలకు దూరంగా సిద్దార్థ్ తాజా ట్రాఫిక్ పోలీస్ పాత్రలో కనివిందు చేయబోతున్నారు.
‘పోలీస్ లైఫ్‌లో క్రిమినల్స్‌తోనూ, వాళ్లు చేసే క్రైమ్స్‌తోనే బతకాల్సి వస్తుంది. డిపార్ట్‌మెంట్ లోపలైనా బయటైనా ఎవరితోనూ నిజాయతీగా ఉండలేకపోతున్నాను. కాబట్టి, ఈ లోకంలో ఎవరో ఒక్కరితోనైనా 200శాతం నిజాయతీగా ఉండాలనుకుంటున్నాను’ ‘రాసిపెట్టుకో.. నిన్ను మాత్రమే కాదు నీ ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేస్తా’ అని అంటూ సిద్దార్థ్ చెప్పిన పలు డైలాగ్స్ అదిరిపోయాయి.
ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఒరేయ్ బామ్మర్ది’. ‘బిచ్చగాడు’ చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కీలకపాత్ర పోషించారు. ఇందులో బైక్ రేసులంటే ఆసక్తి చూపించే ఆవేశపరుడైన యువకుడి పాత్రలో జీవీ ప్రకాశ్ పోషించారు.
ఇప్పుడు విడుదలైన ట్రైలర్‌లో సిద్దార్థ్, జీవీ ప్రకాశ్‌ల నటన ఆకట్టుకునేలా ఉంది. ఆగస్టు 13న ‘ఒరేయ్ బామ్మర్ది’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది.