డిఫరెంట్ పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘జోహార్’. ఓ అబ్బాయి అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టయినా సరే… మా నాన్న విగ్రహాన్ని కట్టిస్తానని చెప్పే ఓ యువ రాజకీయ నేత. పరుగు పందెంలో గెలవాలనుకునే అమ్మాయి, భర్త లేని ఓ స్త్రీ ఇలా వీరి మధ్య నడిచే కథకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం ఉంది’’ అనేది తెలియాలంటే మాత్రం ‘జోహార్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. తేజ మార్ని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సందీప్ మార్ని నిర్మించారు. ఈ చిత్రం తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ ద్వారా ఆగస్ట్ 14న విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే. దీంతో చిత్రయూనిట్ ప్రొమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. రీసెంట్‌గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా టీజర్ విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా చిత్రంలోని గంగమ్మ పాత్రకు సంబంధించిన గ్లిమ్స్‌ను డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా విడుదల చేయించారు. ఉద్దానం ఇష్యూని హైలెట్ చేస్తున్న ఈ గ్లిమ్స్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

