telugu navyamedia
వార్తలు

హిమాచల్‌లో భారీ వర్షాలు – సిమ్లాలో ఐదు అంతస్తుల భవనం కూలి కలకలం

24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ తడిసిముద్దైంది. రాజధాని సిమ్లా సహా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా అపారనష్టం వాటిల్లింది.
సిమ్లా సమీపంలోని భటకుఫర్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఐదు అంతస్తుల నివాస భవనం కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
భవంతి కూలే అవకాశం ఉందని భావించడంతో ముందు జాగ్రత్త చర్యగా, ఆ ప్రాంతంలోని చుట్టుపక్కల ఐదు భవనాలను అధికారులు ఖాళీ చేయించారు. దీంతో అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
కూలిపోయిన భవనం రంజనా అనే మహిళకు చెందినదిగా సిమ్లా రూరల్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) మంజీత్ శర్మ చెప్పారు.
భవనం కూలే అవకాశం ఉందని భావించడంతో రాత్రికి రాత్రి భవనంలోని వారందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించి భవనాన్ని ఖాళీ చేయించామని శర్మ అన్నారు.
ఉదయం 8:00 గంటల ప్రాంతంలో భవనం కుప్పకూలిందని.. ఈ బిల్డింగ్‌కు పక్కనే ఉన్న మరో మూడు, నాలుగు భవనాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని ఆయన చెప్పారు.
దీంతో వాటన్నింటినీ కూడా ఖాళీ చేయించామని మంజీత్ శర్మ చెప్పారు.

కాగా, బిల్డింగ్ కుప్పకూలడానికి ఇంటికి ఎదురుగా హైవే వెడల్పు చేసే పనులే కారణంగా భావిస్తున్నారు.

జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్మిస్తోన్న నాలుగు లేన్ల నిర్మాణ (హైవే విస్తరణ) పనులతో బిల్డింగ్ కూలిపోవడం ముడిపడి ఉండవచ్చని శర్మ అన్నారు.

‘హైవే నిర్మాణ పనుల కారణంగా, ముఖ్యంగా పెద్ద పెద్ద బండరాళ్లు తవ్వకం కోసం భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నందున ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అంటున్నారు.

దీంతో భూమి వదులుగా మారి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని చెబుతున్నారు. అయితే, దీనిపై కచ్చితమైన నిర్ధారణకు రావలసి ఉందని సదరు అధికారి అన్నారు.

ఇక, ఆ ప్రాంతంలో మిగిలిన భవనాల భద్రతను సివిల్ ఇంజనీరింగ్ బృందం అంచనా వేస్తుంది. అనుమానాస్పదంగా ఉన్న భవంతుల్ని తదుపరి నోటీసు వచ్చే వరకు ఖాళీ చేయిస్తున్నామని శర్మ తెలిపారు.

Related posts