వరంగల్ ఈస్ట్ డివిజన్ టీ న్యూస్ రిపోర్టర్ గా పనిచేస్తున్న పొన్నం ప్రవీణ్ మృతి పట్ల తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు సంతాపం తెలియజేశారు. ప్రవీణ్ అకాల మరణం ఎంతో బాధాకరమని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ప్రవీణ్ తో పరిచయం ఏర్పడిందని వెల్లడించారు. వార్తల సేకరణలో ప్రవీణ్ ఎంతో చురుకుగా ఉండేవాడని తెలిపారు. ప్రవీణ్ మృతి పట్ల అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.