ఇండిగో విమానంలో తన బ్యాటు చోరీకి గురైందని క్రికెటర్ హర్భజన్ సింగ్ ఫిర్యాదు చేశారు. భారత స్పిన్ బౌలర్ హర్భజన్, ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నారు. శనివారం ఆయన ముంబై నుంచి కోయంబత్తూరుకు విమానంలో వెళ్లారు.
కోవైలో దిగాక తన కిట్ బ్యాగ్ బరువు తక్కువగా అనిపించడంతో, చూడగా, బ్యాటు కనిపించలేదు. దీంతో వెంటనే ట్విట్టర్ ద్వారా ఇండిగో విమానయాన సంస్థకు ఫిర్యాదు చేశారు. తన బ్యాట్ పోయిందని దాన్ని గుర్తించాలని సూచించారు. విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఇండిగో ప్రతినిధి ఒకరు, బ్యాటును కనుగొనేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
సీఎం తన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలి: కన్నా