వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలవడంతో టీడీపీ నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ మండిపడ్డారు. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ పొత్తు అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారని నిప్పులుచెరిగారు. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే  కేటీఆర్ జగన్‌తో  భేటీ అయ్యారని అన్నారు. 
తెలంగాణలో టీడీపీని కాంగ్రెస్‌ని ప్రజలు ఏవిధంగా తిరస్కరించారో, ఆంధ్రాలో కూడా టీడీపీ, కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరించడం ఖాయమని ఆయన తెలిపారు.  వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూడలేక టీఆర్ఎస్తో పొత్తు అంటూ టీడీపీ విషప్రచారం చేస్తుందని గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో 4సంవత్సరాలు సంసారం చేసి ఇప్పుడు టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెబుతున్నారని విమర్శించారు.



మరో రెండు టర్మ్‌లు నేనే సీఎంగా ఉంటా.. అసెంబ్లీలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు