telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇండియాలో కరోనా కల్లోలం : భారీ సాయం ప్రకటించిన కెనడా

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.79 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 3,60,960 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 3293 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,61,162 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇండియాకు అండగా నిలుస్తామని ఇప్పటికే చాలా దేశాలు మద్దతు ప్రకటించాయి. అందులో భాగంగానే వైద్య సామగ్రి, ఆక్సిజన్ ను ఇండియాకు అందిస్తూ తమ వంతు సాయం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం కూడా 10 మిలియన్ డాలర్లు ఆర్థిక సాయంగా ప్రకటించింది. మానవతా దృక్ప‌థంతో 10 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధులను కెనడియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అందజేస్తున్నట్లు కెనడా అంతర్జాతీయ వ్యవహారాల అభివృద్ది శాఖ మంత్రి కరీనా పేర్కొన్నారు.

Related posts