telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు మిలాద్ ఉన్ నబీ జరుపుకుంటున్న ముస్లింలకు శుభాకాంక్షలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

మిలాద్ ఉన్ నబీ జరుపుకుంటున్న ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

‘అజ్ఞానాన్ని పారద్రోలి అశేష ప్రజానీకంలో విశ్వాసం నింపిన మహమ్మద్ ప్రవక్త జన్మదినానికి గుర్తుగా నిర్వహించుకునే మిలాద్ ఉన్ నబీ ముస్లిం సోదరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.

నీతి, నిజాయితీ, ప్రేమ, త్యాగం లాంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ జీవితం కొనసాగించిన మహమ్మద్ ప్రవక్త ప్రవచించిన సూత్రాలను పాటించేందుకు ప్రేరణ కల్పించేది మిలాద్ ఉన్ నబీ. సాటివారిని గౌరవిస్తూ, వారి ఆకలి తీర్చే పవిత్ర ఆశయాలు కొనసాగాలి.

అందుకు ముస్లిం సోదరులు ముందు వరుసలో ఉండాలి’ అని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

Related posts