తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు గారు శ్రీమతి భువనేశ్వరి తో ఈరోజు విజయవాడలోని కనక దుర్గమ్మ దర్శనం చేసుకొని తిరిగి బయలుదేరారు .
దారిలో ఆయనకు విద్యార్ధినులు కనిపించారు . చంద్ర బాబును చూసి వారు సంతోషంతో చేతులు ఊపారు . వారి కోసం బాబు ఆగి పలుకరించారు . వారంతా గుంటూరు ఉమెన్స్ కాలేజ్ కు చెందిన విద్యార్ధినులని తెలుసుకున్నారు. ఉండవల్లి నివాసానికి వెళుతూ ఉండగావీరంతా కొండవీటి వాగు లిఫ్ట్ వద్ద కనిపించారు. ఎక్కడ నుంచి వచ్చారు అని వారిని బాబు అడిగారు. తాము బిఇడి విద్యార్థులమని, స్టడీ టూర్ కోసం గుంటూరు నుంచి వచ్చామని చెప్పారు. వారినందరినీ ఆత్మీయంగా పలుకరించినా బాబు విద్యార్థినులతో ఫోటోలు దిగారు.
							previous post
						
						
					
							next post
						
						
					

