telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు తుపాను ప్రభావం కలిగిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది: మంత్రి అచ్చెన్నాయుడు

కోనసీమ జిల్లాలో 20 వేల ఎకరాల్లో వరి పంట నష్టం. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు తుపాను ప్రభావం కలిగిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమించాం, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూశాం. పంట నష్టంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇస్తాం, ప్రతి రైతును ఆదుకుంటాం అన్నారు .

జిల్లాలో 300 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, 25 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయి అన్నారు.

యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు, అన్ని రోడ్లపై కూలిన భారీ వృక్షాలను తొలగించాం, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాం అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

Related posts