telugu navyamedia
సినిమా వార్తలు

ఆరోజు 3 గంటలు రక్తం కారుతూనే ఉంది : గోపీచంద్

Chanakya

గోపీచంద్, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం “చాణక్య‌”. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. తిరు ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా ఈ సినిమా రూపొందుతోంది. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ స్పై థ్రిల్ల‌ర్ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసుకుంటుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను అక్టోబ‌ర్ 5న విడుద‌ల చేస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైలర్, పాట‌లు మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుని సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. అయితే గోపీచంద్‌కు అయిన యాక్సిడెంట్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పెద్ద యాక్సిడెంట్ జరిగి గోపీచంద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ యాక్సిడెంట్ గురించి తాజాగా స్పందించాడు. “సినిమాలో చాలా రిస్కీ షాట్స్ ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసేశాం. చాలా చిన్న షాట్ చివరి రోజు ప్లాన్ చేశాం. పరిగెత్తుకుంటూ వచ్చి స్టార్ట్ అయి ఉన్న బైక్‌ను తీసుకెళ్లాలి. అయితే ఆ బైక్‌కు కొంచం ప్రాబ్లమ్ ఉండడంతో ఫుల్‌గా రైజ్ అయిపోయింది. కంట్రోల్ చేయడం కష్టమైంది. వదిలేద్దామంటే ఎదురుగా ఇద్దరు కెమేరామెన్లు ఉన్నారు. అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించా. కుదరలేదు. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే నరాలు కట్ అయ్యి రక్తం రావడం మొదలైంది. అది మారుమూల పల్లె ప్రాంతం కావడంతో దగ్గర్లో హాస్పిటల్ లేదు. దీంతో మూడు గంటలపాటు ప్రయాణించి హాస్సిటల్‌కు వెళ్లాం. ఆ మూడు గంటలూ రక్తం కారుతూనే ఉంది” అని గోపీచంద్ చెప్పాడు.

Related posts