telugu navyamedia
సినిమా వార్తలు

ఎన్టీఆర్ ఫ్యాన్స్కి శుభవార్త.. ప్రశాంత్ నీల్ #NTR31 మూవీపై అదిరిపోయే అప్డేట్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) కు వరల్డ్ వైడ్ గా ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. RRR హిట్ తరువాత ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది.

RRR తరువాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడానికి చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. దేవర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మూవీస్ మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచేశాడు.

దేవరని ఇప్పుడు రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అందుకే ఎన్టీఆర్ సినిమాలపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. అందుకు తగ్గట్టుగానే తన నెక్స్ట్ సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్.

అందులో భాగంగా వస్తున్న మూవీనే NTR31. ఈ సినిమాను కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.

ఏదేమైనా ఎన్టీఆర్ స్పీడ్ తో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ సినిమాల అప్డేట్స్ తో తెగ సందడిగా ఉంది.

ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నా NTR31 సినిమా 2024 సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందట.

ఇప్పటికే ఈ సినిమా కు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.

ప్రశాంత్ సలార్ పార్ట్ 2 ఫినిష్ చేయగానే ఈ సినిమా సెట్స్ కి వెళ్లనుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.

ఈ న్యూస్ తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగిరిగంత్తేస్తున్నారు. మరి ఈ రేంజ్ అంచనాల మధ్య తెరకెక్కనున్న ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ పై ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related posts