బంగారం ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. అయితే… బులియన్ మార్కెట్లో మూడు రోజులుగా పెరిగిన బంగారం ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 48,710 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 44, 650 పలుకుతోంది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధర రూ. 700 తగ్గి రూ. 75,300 వద్ద కొనసాగుతోంది.
previous post
త్రిష, నయనతారలను తల్లి పాత్రల కోసం ఎందుకు అడగరు… హీరోయిన్ ఫైర్ ?