telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐసోలేషన్‌లోకి గౌతం గంభీర్…

gambhir fire on selection board on rayudu

దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం 6 వేలకు పైగా కేసులు నమోదవుతన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ మహమ్మారి ప్రభావంతో మాజీ క్రికెట‌ర్, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ గౌతం గంభీర్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. గంభీర్ నివాస భవనంలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో.. సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు ఆయన శుక్రవారం ట్వీట్ చేసి వెల్లడించారు. కొవిడ్ టెస్టుల‌కు గంభీర్ త‌న న‌మూనాల‌ను పంపించాడు. ప్ర‌తి ఒక్క‌రూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని, ఎవ‌రూ కూడా తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌ని గంభీర్ విజ్ఞ‌ప్తి చేశారు. అలాగే తన కుటుంబసభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ భారత మాజీ ఓపెనర్ భారతదేశానికి 2 ప్రపంచ కప్‌లు (2007 లో టీ 20 ప్రపంచ కప్ మరియు 2011 లో వన్డే ప్రపంచ కప్) గెలవడానికి సహాయం చేసాడు. అతను రెండు ప్రపంచ కప్‌ల ఫైనల్స్‌లో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఆ రెండు మ్యాచ్లలో భారత్ ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచింది. అయితే 58 టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 41.95 సగటుతో 4,154 పరుగులు చేసిన గంభీర్ ఒకప్పుడు ఐసీసీ టెస్ట్ బాట్స్మెన్ ‌గా కూడా అగ్రస్థానంలో ఉన్నాడు. 2012 లో తన చివరి టీ 20 మ్యాచ్, 2013 లో చివరి వన్డే మ్యాచ్ మరియు 2016 లో అతని చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.

Related posts