telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఫీజుల విషయంలో ఏపీ కీలక నిర్ణయం…

cm jagan

ఏపీ లోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఫీజుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  2020 నుంచి 2023 వరకు విద్యాసంవత్సరాలకు సంబంధించి ఎంబీబీఎస్, బిడిఎస్, సూపర్ సూపర్ స్పెషాలిటీ ఫీజులను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది.  గతంలో రూ.12,155 గా ఉన్న ఎంబిబిఎస్ కన్వీనర్ కోటా ట్యూషన్ ఫీజును రూ.15 వేలకు పెంచగా, రూ.13.57 లక్షలు ఉన్న బి కేటగిరి ఫీజును రూ.12 లక్షలకు తగ్గించారు.  ఇక 33 లక్షలుగా ఉన్న ఎన్నారై కోటా ఫీజును రూ.36 లక్షలుగా సవరించారు.  అంతేకాదు సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజును రూ. 15 లక్షలకు సవరించారు.  సవరించిన ఈ ఫీజులు అన్ ఎయిడెడ్, మైనారిటీ, నాన్ మైనారిటీ కాలేజీలకు వర్తిస్తాయని ప్రభుత్వం జీవోలో పేర్కొన్నది.  ఇకపై ఐదేళ్ల ఫీజుకు బదులుగా నాలుగున్నరేళ్ల ఫీజును మాత్రమే వసూలు చేయాలనీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది.  ఇతరత్రా ఫీజుల పేరుతో ఏవైనా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.  

Related posts