telugu navyamedia
రాజకీయ వార్తలు

ఉత్తర ప్రదేశ్ పోలీసుల పై మండిపడ్డ శివసేన సీనియర్ నేత…

యూపీ లో జరిగిన హాత్రాస్ ఘటనను వ్యతిరేఖంగా నిరసనలు జరుగుతున్నాయి.. ఢిల్లీ లో ఈ ఘటన పై భారీ స్థాయిలో ర్యాలీలు జరుగుతున్నాయి. దళిత యువతి పై జరిగిన అత్యాచారం అమానుషం అంటూ రాజకీయ, సామాజిక నేతలు ఆందోళనలు చేస్తున్నారు. అయితే బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న నేతల పై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన రాహుల్ గాంధీపై పోలీసుల ప్రవర్తన అమానుషంగా ఉండటంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

 

ఈ ఘటన మరువక ముందే ఇప్పుడు మరోసారి పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తించారు. ఇప్పుడు బాధిత కుటుంబాన్ని కలవడానికి వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పట్ల ఓ పోలీస్ ప్రవర్తించిన తీరుపై నిరసన వ్యక్తమవుతోంది. ఢిల్లీ- యూపీ సరిహద్దు వద్ద శనివారం ప్రియాంక కుర్తా పట్టుకుని ఓ పోలీస్ లాగడం వివాదాస్పదమయ్యింది. ఈ విషయం పై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మండిపడ్డారు..మహిళ పై అమానుషంగా ప్రవర్తించిన పోలీసు అధికారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

Related posts