telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పొదిలి రైతులపై గంజాయి రౌడీ మూక తాండవం: జగన్ పర్యటన బాధల బొమ్మగా మారింది

పొదిలి పొగాకు రైతుకు పీడకలగా జగన్ రాక

“గంజాయి రౌడీ మూకల” తాండవం!

జగన్ మోహన్ రెడ్డిగారి “గంజాయి రౌడీ మూక” ఇప్పుడు పొదిలి పొగాకు రైతుల పాలిట యమదండంగా మారింది. పాపం, కష్టపడి పండించిన పొగాకును మదపుటేనుగుల లెక్కన తొక్కి నాశనం చేస్తే, ఆ రైతుల కన్నీళ్లకు దిక్కు ఎవరు? జగన్ గారు ముఖ్యమంత్రిగా లేరు, కనీసం ప్రతిపక్క్ష నేత కాదు. కనీసం పులివెందుల ఎమ్మెల్యేగా అన్నదాతలపై జాలి ఉండాలి కదా!

“అక్కడ పొగాకు రైతులు లేరు” – మరి వీళ్ళు ఎవరు?
విచిత్రం ఏమిటంటే, ఈ విధ్వంసం జరిగిన చోట “పొగాకు రైతులు లేరు”. ఆ కోపంతో రైతులు కష్టపడి పండించిన పంటను ధ్వంసం చేసి, సిగ్గు లేకుండా ప్రభుత్వం పై మాట్లాడటం ఏంటి? రైతులకు ఇంతకంటే ఘోర అవమానం ఇంకేమైనా ఉంటుందా?

రౌడీమూకల రాచకార్యాలు: అన్నీ గంజాయి మత్తులోనా?

పొగాకు బేళ్ళను నాశనం చేసిన ఈ “గంజాయి రౌడీ మూక” పనులు చూస్తుంటే, వీరు మామూలు మనుషులు కాదని స్పష్టమవుతోంది. కళ్ళుండి చూడలేని అంధత్వం, చేతులుండి పట్టుకోలేని చేతకానితనం… ఇదంతా మత్తు ప్రభావమేనా? రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి అన్నదాతల నోట్లో మట్టి కొట్టడం ఎంతవరకు సమంజసం?

జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు గంజాయి సాగు, డ్రగ్స్ వాడకం పెరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఆయన పార్టీ అనుచరుల “రౌడీయిజం” ఇలా గంజాయి వాసనతో రైతుల జీవితాలను తొక్కేస్తుంటే, దానికి ఎవరు బాధ్యులు?

వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి… మీరు చూసింది “చోద్యం” కాదు, రైతుల కన్నీరు!

పొదిలిలో ఈ విధ్వంసం జరుగుతుంటే, వైసీపీ సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా అక్కడే ఉన్నారు! “గంజాయి మూక స్వైరవిహారం ఆపకుండా చోద్యం చూశారు” అని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు కష్టపడి పండించిన పంటను నాశనం చేస్తుంటే, కళ్ళ ముందు చూస్తూ కూడా ఆపకపోవడం ఎంత సిగ్గుచేటు? వీరికి రైతులంటే కనీస గౌరవం లేదా?

రైతులకు అండగా నిలబడతామని చెప్పి వచ్చి వాలిన ఈ మంద, ఇప్పుడు రైతుల పంటను నాశనం చేశారు. ఇది వారి వైఫల్యమా, లేక పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారా?

కేసులు నమోదు చేయాలని డిమాండ్: న్యాయం జరుగుతుందా?

ఈ విధ్వంసంతో ఆ పొగాకు బేళ్లు అమ్మేది ఎలాగో తెలియక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. “జగన్ రౌడీ మూకల విధ్వంసం మీద కేసులు నమోదు చెయ్యాలి” అని డిమాండ్ చేస్తున్నారు. గత ఐదేళ్లుగా వైసీపీ నాయకుల అరాచకాలను చూసిన ప్రజలకు, ఇప్పుడు ఈ డిమాండ్ నెరవేరుతుందా లేదా అనే అనుమానం కలుగుతోంది. కొత్త ప్రభుత్వం వచ్చినా, పాత మూకల ఆగడాలు కొనసాగడం ప్రజాస్వామ్యానికే పెను సవాల్.

రైతులారా, మీకు న్యాయం జరగాలి! మీ కన్నీళ్లు ఈ “గంజాయి రౌడీ మూక”కు శాపంగా మారాలి!

Related posts