ఈ ఘటనే జోర్డాన్ దేశంలో జరిగిన ఓ మహిళల ఫుట్‌బాల్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది. జోర్డాన్, అరబ్ దేశాల మధ్య మ్యాచ్ సందర్భంగా అరబ్ జట్టుకు చెందిన ఓ యువతి.. బంతిని తీసుకొని పరిగెడుతోంది. ఇంతలో ఆమె హిజాబ్ (ముస్లింలు తలపై కట్టుకునే ఓ వస్త్రం) జారిపోయింది. ఆ మతాచారాల ప్రకారం హిజాబ్ లేకుండా మహిళలు బయటకు రాకూడదు. అలాంటిది నిండు స్టేడియంలో తన హిజాబ్ జారిపోవడంతో ఆ యువతికి ఏం చేయాలో తెలియలేదు. ప్రత్యర్థి జట్టు యువతులు ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నారు. వెంటనే చుట్టూ చేరి ఆమె ఎవరికీ కనిపించకుండా అడ్డు నిలుచున్నారు. వారి మధ్యలో కూర్చున్న ఆమె.. తన హిజాబ్‌ను మళ్లీ కట్టుకుంది. ప్రత్యర్థి మత సంప్రదాయలకు జోర్డాన్ ప్లేయర్స్ ఇచ్చిన గౌరవానికి స్టేడియంలో ప్రేక్షకులంతా ముగ్ధులయ్యారు. చప్పట్లతో వారికి తమ మద్దతు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
JUST BEAUTIFUL.
Opponents huddle up around a Hijabi footballer in order to protect her from showing her hair. pic.twitter.com/O5aC84AhmN
— Shuaib Ahmed (@Footynions) October 13, 2019