telugu navyamedia
క్రైమ్ వార్తలు

జార్ఖండ్‌లోని రామ్‌ఘ‌ర్‌లో దారుణం..

జార్ఖండ్‌లోని రామ్‌ఘ‌ర్‌లో దారుణం జ‌రిగింది. బ‌స్సును ఢీకొన్న కారులో మంట‌లు చెల‌రేగాయి. బస్సును కారు ఢీకొట్టడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు తలెత్తాయి. అనంతరం బస్సుకూ మంటలు వ్యాపించాయి. దీంతో ఐదుగురు ప్రయాణికులు మంట‌ల్లో కాలి బూడిద‌య్యారు.

బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురు సజీవదహనం - TNews Telugu

ఈ ఘ‌ట‌న‌ రామ్‌ఘ‌ర్ జిల్లాలో ని జాతీయ ర‌హ‌దారి 23పై జ‌రిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ టీనేజీ అబ్బాయి ఉన్నారని తెలిపారు. బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.బాధితులు పట్నాకు చెందినవారని పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Related posts