telugu navyamedia
సాంకేతిక

ఐఫోన్ 13 సిరీస్‌లో నాలుగు స్మార్ట్‌ఫోన్లు.. ఇండియాలో ధర ఎంతంటే

టెక్‌ దిగ్గజం యాపిల్‌.. ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో , ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ని పరిచయం చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు ఇండియాలో రూ.69,900 నుంచి ప్రారంభం అవుతాయి. తక్కువ ధరలో కావాలంటే ఐఫోన్ 13 మినీ కొనొచ్చు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కావాలంటే ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ కొనాలి. ప్రతీ ఏడాది సెప్టెంబర్‌లో యాపిల్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్స్, గ్యాడ్జెట్స్ వస్తుంటాయి. అందులో భాగంగా ఇప్పుడు నాలుగు కొత్త ఐఫోన్ స్మార్ట్‌ఫోన్స్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది.

ఐఫోన్‌ 13ప్రో మ్యాక్స్‌
128జీబీ: రూ.1,29,900
256జీబీ: రూ. 1,39.900
512జీబీ: రూ. 1,59,900
1టెరాబైట్‌ : రూ. 1,79,900

ఐఫోన్ 13 ప్రో
128జీబీ: రూ. 1,19,900
256జీబీ: రూ. 1,29,900
512జీబీ:రూ. 1,49,900
1టెరాబైట్‌ : రూ. 1,69,900

ఐఫోన్ 13
128జీబీ: రూ.79,900
256జీబీ: రూ. 89,900
512జీబీ: రూ. 1,09,900

ఐఫోన్ 13 మినీ
128జీబీ: రూ. 69,900
256జీబీ: రూ. 79,900
512జీబీ: రూ. 99,900

ఐఫోన్‌ 13 సిరీస్‌ ఫోన్‌ ప్రీ ఆర్డర్లు అప్పుడే
యాపిల్‌ విడుదల చేసిన ఐఫోన్‌13 సిరీస్‌ ఫోన్‌ ప్రీ ఆర్డర్లు సెప్టెంబర్17, శుక్రవారం సాయంత్రం 5:30నుంచి ప్రారంభం కానుండగా..సెప్టెంబర్ 24 శుక్రవారం నుంచి అందుబాటులో ఉంటాయి.

 

Related posts