telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఢిల్లీలో అడుగుపెట్టిన బ‌ర్డ్ ఫ్లూ…

గత ఏడాది వచ్చిన కారోబా వైరస్ మన దేశంతో పాటుగా మొత్తం దేశాన్ని కూడా అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే మళ్ళీ యూకే నుండి కొత్త స్ట్రెయిన్ కేసులు వస్తున్నాయి. ఈ క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టికే ల‌క్ష‌లాదిమంది ఇబ్బందులు ప‌డుతున్నారు.  అయితే, క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటం చేసేందుకు దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావ‌డంతో క‌రోనా అంతం అవుతుంద‌ని అధికారులు, ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు.  ఒక‌వైపు క‌రోనా ఇబ్బందులు పెడుతుంటే, మ‌రోవైపు బ‌ర్డ్ ఫ్లూ దేశాన్ని భ‌య‌పెడుతోంది.  అనేక రాష్ట్రాల్లో బ‌ర్డ్ ఫ్లూ వ‌ల‌న వేలాది ప‌క్షులు, కోళ్లు మృత్యువాత ప‌డుతున్నాయి.  ఇక ఇదిలా ఉంటే, డిల్లీలో తొలి బ‌ర్డ్ ఫ్లూ కేసులు అధికారికంగా నిర్ధారించారు.  నేష‌న‌ల్ జులాజిక‌ల్ పార్క్ లోని గుడ్ల‌గూబ‌కు బ‌ర్డ్ ఫ్లూ సోకి చ‌నిపోయింద‌ని  జూ అధికారులు నిర్ధారించారు.  వెంట‌నే జూ ను శానిటేష‌న్ చేయడంతో పాటుగా, అక్క‌డి మాంసాహారం తీసుకునే జంతువుల‌కు కోడి మాంసం ఇవ్వ‌డం నిలిపివేశారు. చూడాలి మరి ఇది ఇలా ఎక్కడి వరకు వెళ్తుంది అనేది.

Related posts