telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

విజయ్ మాస్టర్ దర్శకుడితో ఎన్‌టీఆర్..?

ntr

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో మల్టీస్టారర్ సినిమాలో చేస్తున్నాడు ఎన్‌టీఆర్. దీనికి ఆర్ఆర్ఆర్ పేరును ఖరారు చేశారు. ఇందులో రియల్ హీరో కొమరం భీమ్ పాత్రలో ఎన్‌టీఆర్ కనిపించనున్నాడు. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో తన రెండో సినిమాను ఖరారు చేశాడు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి అయినను పోయిరావలే హస్తినకు అనే పేరును ఖరారు చేశారు. అయితే ఈ సినిమా పట్టాలెక్కక ముందే ఎన్‌టీఆర్ మరో సినిమాను లాక్ చేశాడట. దీనికి తమిళ సూపర్ స్టార్ విజయ్ దలపతి హీరోగా మాస్టర్ సినిమాను తెరకెక్కించిన లోకేష్ కనగరాజన్ దర్శకత్వం చేయనున్నాడట. వీరి కాంబోని ప్రముఖ నిర్మాత మహేశ్ కోనేరు సెట్ చేశాడట. మాస్టర్ తెలుగు హక్కులను కొనుగోలు చేసిన మహేష్ కోనేరు. సినిమా విడుదల సమయంలోనే లోకేష్‌తో మంచి స్నేహం ఏర్పడింది. ఈ స్నేహంతోనే తన బెస్ట్ ఫ్రెండ్ ఎన్‌టీఆర్‌తో సినిమాను లాక్ చేశాడట. వీరి కాంబో సినిమా త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాత మొదలవుతుందట. ఈ సినిమాను మహేష్ సొంత బ్యానర్ కోస్ట్ ఎంటర్‌టైన్మెంట్, కళ్యాణ్ రామ్ ఎన్‌టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మించనున్నాయట. ఇంతలో లోకేష్ కమల్ హాసన్ హీరోగా విక్రమ్ అనే సినిమాను తెరకెక్కించనున్నాడు.

Related posts