* ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య..
*బొగ్గుల కుంపటిలో కెమికల్ పోసి పొగను పీల్చుకున్న ప్రత్యూష?
*ప్రత్యూష గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ లభ్యం
* దేశంలోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌గా ప్రత్యూష గుర్తింపు..
ఫ్యాషన్ ప్రపంచంలోనే తిరుగులేని పేరు సంపాదించుకున్న ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల మృతి చెందింది.. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో తన నివాసంలో ప్రత్యూష.. శనివారం ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రత్యూష గదిలో కార్బన్‌మోనాక్సైడ్ బాటిల్ లభ్యమైంది. దీంతో ఆమె కార్బన్‌మోనాక్సైడ్ వాయువు పీల్చి మృతి చెందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యం అయ్యింది. అమె డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇంకా ఎంత కాలం తల్లి దండ్రులకు భారంగా ఉండాలి ..నేను కోరుకున్న జీవితం ఇది కాదు అంటూ సూసైడ్ నోట్ రాసింది.
కాగా .. ఫ్యాషన్ డిజైనర్‌గా ప్రత్యూష గుర్తింపు పొందారు. బాలీవుడ్, టాలీవుడ్‌లో ప్రముఖ హీరోయిన్లకు ప్రత్యూష డ్రెస్‌లు డిజైన్ చేశారు. దేశంలోని 30 మంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్‌లో ప్రత్యూష ఒకరుగా గుర్తింపు ఉంది.