బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుపాన్ శనివారం సాయంత్రానికి చెన్నైకి ఆగ్నేయంగా 1200 కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1390 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం నాటికి తీవ్ర తుపాన్‌గా, 29 కల్లా అతి తీవ్ర తుపాన్‌గా బలపడనుంది.అయితే ఈ తుపాన్ ఆంధ్రప్రదేశ్‌కు నష్టం కలిగించే అవకశాలు లేవని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఈ క్రమంలో రానున్న మూడు రోజులు శ్రీలంక తీరం వెంబడి వాయువ్య దిశగా పయనించి 30వ తేదీ సాయంత్రానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరందిశగా వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పశ్చిమ, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 30 నుంచి 31 డిగ్రీల వరకు ఉండడం.. తుపాన్ బలపడేందుకు దోహదం చేస్తాయని నిపుణలు చెబుతున్నారు. అతి తీవ్ర తుపాన్‌గా బలపడే క్రమంలో దాని పయణం మందగించే అవకాశముందన అంచనావేస్తున్నారు.
ఇసుక కొరతతో 30 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి: చంద్రబాబు