కడప నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈరోజు కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరుగనుంది.
ఆసక్తిగా మారిన కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం. ఇటీవల మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న మేయర్ సురేష్ బాబు. కొంతకాలంగా మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే మాధవిరెడ్డి మధ్య విభేదాలు.
సమావేశ మందిరంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి చాంబర్ లో మేయర్, వైసీపీ కార్పొరేటర్లు కార్పొరేషన్ దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇద్దరు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 20 మంది ఎస్ఐ, 53 ఏఎస్ఐ, 110 కానిస్టేబుల్, 4 స్పెషల్ పార్టీ బృందాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
అలాగే కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కార్పొరేటర్‌లు తప్ప ఇతరులు ఎవరికీ కూడా లోనికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.

