రాష్ట్రంలో ఏనుగుల గుంపులు పంట పొలాలు ధ్వంసం చేయడం, కొన్ని సందర్భాల్లో మనుషులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది.
ఈ సమస్యల నివారణకు కుంకీ ఏనుగులు అవసరం. కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ నుంచి కుంకీ ఏనుగులు పొందేందుకు పవన్ కళ్యాణ్ కొన్ని నెలల క్రితం బెంగళూరు వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రులతో సమావేశమై తమ రాష్ట్రంలోని సమస్యను వివరించారు.
తమ రాష్ట్రం నుంచి ఆరు కుంకీ ఏనుగులు పంపేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకరించింది.
ఈ రోజు పవన్ కళ్యాణ్ బెంగళూరు చేరుకొని కర్ణాటక గవర్నమెంట్ నుంచి పవన్ కళ్యాణ్ కుంకీ ఏనుగులు స్వీకరించారు.
కర్ణాటక విధాన సౌధలో ఉదయం 11 గంటలకు కుంకీ ఏనుగుల అప్పగింత కార్యక్రమం జరిగింది.
కర్ణాటక ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, అటవీ పర్యావరణశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే అధికారికంగా ఆరు కుంకీ ఏనుగులను ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అప్పగించారు.
ఈ ఏనుగుల పేర్లు రంజని, దేవా, కృష్ణా, అభిమన్యు, మహేంద్ర అని అధికార వర్గాలు తెలిపాయి.
రాబర్ట్ వాద్రాను వదిలేది లేదు: మోదీ