ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం విశాఖ రానున్నారు. ఇక్కడ గిరిజన గ్రామాల్లో రెండు రోజులు పర్యటించనున్నారు.
మొదటి రోజు ‘అడవి తల్లి బాట’ పేరుతో చేపట్టిన రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి పవన్ చేతుల మీదుగా శ్రీకారం చుట్టునున్నారు.
అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం, పెదపాడు గ్రామంలో గిరిజన ఆవాసాల సంరక్షణ, ముఖాముఖి కార్యక్రమాలు, బహిరంగ సభ నిర్వహిస్తారు.
రెండవ రోజు మంగళవారం సుంకరమెట్ట ప్రాంతంలో నిర్మించిన వుడెన్ బ్రిడ్జ్ను ప్రారంభిస్తారు. అనంతరం విశాఖకు పయనమవుతారు.
రెండో రోజు మంగళవారం ఉదయం 10 గంటలకు అరకులోయ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఇదే మండలం సుంకరమెట్ట సమీపంలోని కాఫీ తోటలకు చేరుకుంటారు.
అటవీశాఖ చెక్కలతో నిర్మించిన కాలిబాట వంతెనను ప్రారంభిస్తారు. అనంతరం విశాఖపట్నం పయనమవుతారు.
డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్, జేసీ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ఎస్పీ అమిత్ బర్ధార్ పర్యవేక్షిస్తున్నారు.