telugu navyamedia
సినిమా వార్తలు

ఆక‌ట్టుకుంటున్న‌ “ఎదురుచూపు” టైటిల్ పోస్టర్ ..

మణికంఠ వారణాసి హీరో గా మహేశ్వరి వడ్డి హీరోయిన్ గా పరిచయం అవుతున్న చిత్రం ఎదురుచూపు. శ్రీ రామలింగేశ్వర క్రియేషన్స్ పతాకంపై డిఎల్‌వి బన్ని దర్శకత్వంలో దుబ్బాక జగదీశ్వర్ నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో దీపావళి సందర్భంగా విడుదల అయింది.

తమ చిత్ర టైటిల్ పోస్టర్ కు సోషల్ మీడియాలో లో మంచి స్పందన వచ్చిన సందర్భంగా చిత్ర యూనిట్‌ మీడియా సమావేశం నిర్వహించింది చిత్ర‌యూనిట్‌.

ఈ సమావేశంలో దర్శకుడు డిఎల్‌వి బన్ని మాట్లాడుతూ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇది అని, నా వూహల్లో రూపుదిద్దుకున్న కథకు ఏ మాత్రం తీసిపోని విధంగా అవుట్‌పుట్ వచ్చిందని, దానికి కారణం ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా నిర్మాత దుబ్బాక జగదీశ్వర్ గారు ఇచ్చిన సహకారంతో పాటు హీరో మణికంఠ వారణాసి, హీరోయిన్ మహేశ్వరి వడ్డి తో పాటె నటీనటుల ప్రోత్సాహం అని అన్నారు.

Eduruchupu - Twitter Search / Twitter

అమీర్ కెమెరా పనితనంతో, కార్తీక్ కొడ కండ్ల అద్భుతమైన సంగీతంతో సినిమా స్థాయిని పెంచారని,, సినిమా చూసిన ఆడియన్స్ అందరు చాల రోజుల తరువాత ఒక మంచి ఫీల్ గుడ్, మెచ్యుర్డ్ లవ్‌స్టోరీ చూసామని ఫీల్ అవుతారు అని అన్నారు.

నిర్మాత దుబ్బాక జగదీశ్వర్ మాట్లాడుతూ చిత్ర యూనిట్ అందరి సహకారం వల్ల సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతున్నా అని సంతోషం వ్యక్తం చేసారు. డిఎల్‌వి బన్ని నూతన దర్శకుడైనా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని, తొందరలోనే నిర్మాణానంతర కార్యక్రమాలన్ని పూర్తి చేసి విడుదల చేస్తామని వెల్ల‌డించారు.

Related posts