telugu navyamedia
వార్తలు వెబ్ స్టోరీస్

ఐంద్రజాల వికాసానికి ప్రాణం పోసిన డా. పట్టా భిరామ్ గారి జీవయాత్ర

డా॥ బి.వి. పట్టా భిరామ్ అస్త మయం (12.2.1950- 30.6.2025)

తెలుగువారు గర్వించదగిన ప్రముఖ ఐంద్రజాలికుడు, మానసిక వైద్యుడు, ప్రఖ్యాత వ్యక్తి త్వ వికాస నిపుణుడు
డా॥ బి.వి. పట్టా భిరామ్ (75) జూన్ 30 రాత్రి గుండెపోటుతో హైదరాబాద్లో స్వర్గ స్థు లయ్యారు. ఈయనకి భార్య
శ్రీమతి జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. శ్రీమతి జయ కూడా వ్యక్తి త్వ వికాస నిపుణురాలిగా పేరు పొందారు.
ఇటీవలే 75 వసంతాలు పూతిర్ చేసుకున్న పట్టా భిరామ్ తూర్పుగోదావరి జిల్లా కు చెందిన ‘రావ్ సాహెబ్’ భావరాజు
సత్యనారాయణ సంతానంలోని పదిహేను మందిలో ఒకరు. కౌమారదశలో ఒక కాలికి వచ్చిన అవిటితనం వల్ల కలిగిన
ఆత్మన్యూనతా భావాన్ని జయించి తనను తాను ఒక ఐంద్రజాలికుడిగా, రచయితగా తీర్చిదిద్దు కున్నారు. కాకినాడలో
ఉన్నత విద్యాభ్యాసం చేసే రోజుల్లో ఎంబేర్ రావు అనే ఐంద్రజాలకుడి నుంచి గ్రహించిన ఇంద్రజాల విద్యను, ఆయన
తర్వాత హైదరాబాద్ ఆహార సంస
్థ
లో ఉద్యోగం చేసే రోజుల్లో కూడా సాధన చేసేవారు. 1970 దశకం నాటికి
స్వతంత్రంగా రెండుమూడు గంటల పాటు ఇంద్రజాలాన్ని ప్రేక్షకుల్ని కదలనీయకుండా ప్రదరర్శించే స్థాయికి ఎదిగారు.
హైదరాబాద్లో 1984లో కళ్లకు గంతలు కట్టుకొని రవీంద్రభారతి నుంచి చార్మినార్‌కి, తిరిగి రవీంద్రభారతికి
ట్రాఫిక్ బాగా ఉన్న సమయంలో స్కూటర్ నడిపి ఇంద్రజాల విద్యలో తెలుగు నేలమీద కొత్త అధ్యాయాన్ని సృష్టించారు.
ఇంద్రజాల విద్యను ఉపయోగించి బాణామతి, చేతబడుల వంటి మూఢనమ్మకాల నుంచి ప్రజలను జాగృతం చేసే
కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. హిప్నటిజాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చి పలు రుగ్మతలను హిప్నటిజం
ద్వారా పోగొట్టవచ్చునని నిరూపిస్తూ రాష్ట్రవ్యాపితంగా (అవిభక్త ఆంధ్రప్రదేశ్) అనేక ప్రదర్శనలిచ్చారు.
ఎన్.టి. రామారావు ప్రోత్సాహంతో ఇంద్రజాలాన్ని జోడించి ప్రభుత్వ పథకాలకు, మద్యపాన నిషేధం వంటి
కార్యక్రమాలకు ప్రజల్లో ఎలా ప్రచారం కల్పించవచ్చో చూపించారు. మూగ, చెవిటి పిల్లలకి – భాషతో సంబంధం
లేకుండా – ఇంద్రజాల విద్యతో ఎలా విజ్
ఞానాన్ని కలిగించవచ్చో అనేక ప్రదర్శనల్లో తెలియచెప్పారు. గోదావరి వరదల్లో
రాష్ట్రం ఘోరంగా నష్టపోయి లక్షలాది ప్రజలు నిరాశ్రయులైనప్పుడు, తన సహ ఐంద్రజాలికుల్ని వెంటబెట్టుకుని వరద
బాధితుల సహాయార్థం పలు ప్రదర్శనలిచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇంద్రజాలం పేరుతో బాబాల వేషధారణలో
విభూతి సృష్టించడం వంటి మాయలు ప్రదర్శిస్తున్న వారిని నిలదీసి ఇంద్రజాల విద్య ఔన్నత్యాన్ని కాపాడిన తత్వం
పట్టా భిరామ్ గారిది. దేశంలో తొలిసారిగా భారత్ మేజిక్ సర్కిల్ ఏర్పాటు చేసి ప్రజల్లో ఇంద్రజాల విద్యకి కొత్త గౌరవాన్ని,
విశిష్టతని తీసుకువచ్చారు. ఆకాశవాణిలో, దూరదర్శన్లో ఇంద్రజాల విద్యకి ఒక విజ్ఞా నశాస్త్రంగా ప్రచారం కల్పించిన
ఘనత పట్టా భిరామ్‌ గారిదే.
దూరదర్శన్లో కొన్ని సీరియల్స్‌‌లో, వెండితెర మీద కొన్ని సినిమాల్లోనూ ఐంద్రజాలికుడిగా పట్టా భిరామ్ నైపుణ్యాన్ని
జంధ్యాల, యండమూరి వీరేంద్రనాథ్ తదితరులు అర
్థ
వంతంగా ప్రదర్శించారు. ఈ క్రమంలో ప్రముఖ సినీనటులు
శోభన్బాబు, అక్కినేని, జయసుధ, జయప్రద, రాజేంద్రప్రసాద్ వంటి నటులు పట్టా భిరామ్ అభిమానులుగా మారిపోయారు.
భారత ప్రభుత్వం వారి అక్షరాస్యతా ఉద్యమంలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా లలోని అక్షరజ్యోతి పత్రికకు
సంపాదకత్వం వహించి, ఈనాడు రామోజీరావుగారి సహకారంతో ఈ పత్రికకు ఆయా జిల్లాల్లో విస్త్తృత ప్రచారం
కల్పించారు. పొత్తూరి వెంకటేశ్వరరావుగారు, కె. రామచంద్రమూతి గారు ర్ తదితర ప్రముఖ పత్రికా సంపాదకుల
ప్రోత్సాహంతో పత్రికల్లో వ్యక్తి త్వ వికాస వ్యాసాలను రాయటం ప్రారంభించారు. మనస్తత్వశాస్త్రంలో ఎం.ఎ. చేశారు.
ఇరవై సంవత్సరాల వ్యవధిలో రెండు పిహెచ్.డి.లు చేశారు. 1990లో చేసిన పిహెచ్.డి.లో ‘యోగ-హిప్నాటిజం’
తులనాత్మక పరిశీలన సిద
్ధ
ాంత వ్యాసం కాగా, 2015 ప్రాంతంలో రెండో పిహెచ్.డి చేశారు.

Related posts