ఎన్నికలకు ముందు ఆస్తుల వివరాలు వెల్లడించి అందరినీ షాక్‌కు గురిచేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తన కుటుంబ ఆస్తులపై ప్రభుత్వం అత్యధిక స్థాయిలో ఖర్చులు చేస్తోందన్న ఆరోపణలపై స్పందించిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు ముందు తన ఆర్థిక నివేదికను వెల్లడించనున్నట్టు ఆయన తెలిపారు.
ఐర్లండ్‌లో ఉన్న ట్రంప్ భవనంలో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ బస చేయడంతో ఈ ఆరోపణలు వెల్లువెత్తాయి. వచ్చే ఏడాది నవంబరులో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందే తన ఆస్తుల వివరాలు వెల్లడిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, తన ఆస్తులపై ప్రతి ఏడాది ప్రభుత్వానికి ఎంత పన్ను కడుతున్నారన్న విషయాన్ని మాత్రం ట్రంప్ ప్రకటించలేదు.