స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా చేస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కతున్న ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో లక్కీ బ్యూటీ రష్మిక హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు సినిమాపైన అంచనాలను మరింత అదికం చేశాయి. ఈ సినిమాను ఆగస్ట్13న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. ఇక తాజాగా ఈ సినిమా హీరోయిన్ విషయంలో ఓ నిజాన్ని బయటపెట్టాడు దర్శకుడు సుకుమార్. అదేంటంటే… ఈ సినిమాలో హీరోయిన్గా ముందుగా రష్మికను అనుకోలేదంట. మొదటగా ఈ సినిమాకు ఓ తెలుగు అమ్మాయిని ఓకే చేశారంట. కానీ కొన్ని కారణాల కారణంగా ఆ అమ్మాయి సినిమా నుంచి తప్పుకున్నట్లు సుకుమార్ తెలిపారు. అలాగే తన తర్వాతి సినిమాలో తప్పకుండా తెలుగు అమ్మాయినే హీరోయిన్గా తీసుకుంటానని సుకుమార్ పేర్కొన్నాడు. ఇక ఈ సినిమా టీజర్‌ను పుష్ప మేకర్స్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఏప్రిల్8న విడుదల చేయనున్నారంటూ టాక్ నడుస్తోంది. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్‌పై క్లారిటీ వస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి.
previous post


అప్పలనాయుడిని చూస్తుంటే అలా అనిపించడం లేదు: రోజా