టీడీపీ నేత అచ్చెన్నాయుడిపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లిలో ఇసుక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఇసుక రీచ్ ను ధర్మాన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక విషయంలో అవినీతి పాల్పడ్డారంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినట్టు రుజువు చేసినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. ప్రజల కోసం ముఖ్యమంత్రి జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే ప్రతిపక్ష నేతలు ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు.