భారత్కు ఊహించని షాక్ 50 కేజీల రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్కు దూసుకెళ్లిన వినేష్ ఫోగట్ పై 100 గ్రాములు అధిక బరువు ఉన్నందున వేటు పడింది.
పోటీ నిబంధనల ప్రకారం, ఫోగట్ రజత పతకానికి కూడా అర్హత పొందదు.
మంగళవారం ఒక్కరోజే మూడు బౌట్‌ల లో గెలుపొంది ఫైనల్ కు దూసుకెళ్లిన వినేశ్ ఫొగాట్పై వేటు పడింది.
ఈ ఫైనల్ బౌట్ లో గెలిస్తే ఒలింపిక్స్ క్రీడల చరిత్రలో గోల్డ్ సాధించిన తొలి భారతీయ రెజ్లర్ గా ఆమె హిస్టరీ క్రియేట్ చేసేది.
ఈ సంవత్సరం పారిస్ ఒలింపిక్స్ కు క్వాలిఫై అయిన అయిదుగురు మహిళా రెజ్లర్ల లో వినేశ్ ఫొగాట్ ఒకరు.
రెజ్లర్ వినేశ్ ఫొగాట్పై అనర్హత వేటు పడటంపై స్పందించిన ప్రధాని మోదీ – వినేశ్ ఛాంపియన్లలో ఛాంపియన్! – వినేశ్ భారతదేశానికి గర్వకారణం.
“ప్రతి భారతీయునికి స్ఫూర్తి – ఈరోజు ఎదురుదెబ్బ బాధిస్తుంది – సవాళ్లను ఎదుర్కోవడం మీ స్వభావం – బలంగా తిరిగి రండి! మేమంతా మీ కోసం ఎదురు చూస్తున్నాం “: ప్రధాని మోదీ