telugu navyamedia
క్రీడలు వార్తలు

చాహల్ భార్యతో స్టెప్పులేసిన శ్రేయస్‌…

భారత స్పిన్నర్‌ యుజువేంద్ర చహల్ యూట్యూబర్, కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత డిసెంబర్‌లో గురుగ్రామ్‌లో వీరి వివాహం కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఘనంగా జరిగింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లలో చహల్‌కు చోటు దక్కకపోవడంతో ఈ కొత్త జంట సరాదాగా టూర్‌లకు వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా ధనశ్రీ డాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె కొరియోగ్రాఫర్‌ కాబట్టి డాన్స్ చేయడంలో కొత్తేముంది అనుకుంటుంన్నారా?. ధనశ్రీతో డాన్స్ చేసింది టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌. స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మతో కలిసి శ్రేయస్‌ అయ్యర్‌ తాజాగా అదిరే స్టెప్పులు వేశాడు. ‘రోసెస్’ సాంగ్‌కు ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లా స్టెప్పులు ఇరగదీశాడు. ఇంకా చెప్పాలంటే.. కొరియోగ్రాఫర్‌ అయిన ధనశ్రీ కంటే కూడా బాగా వేశాడు. ఇద్దరూ కలిసి కాళ్లతో వేసిన స్టెప్పులు వావ్ అనిపిస్తున్నాయి. చివరికి ధనశ్రీ ఆగిపోగా.. శ్రేయస్‌ మాత్రం డాన్స్ వేస్తూనే ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను శ్రేయస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘మా పాదాల వైపు చూస్తున్నారా?’ అని శ్రేయస్‌ ఆ వీడియోకు వ్యాఖ్య జత చేశాడు. అయితే శ్రేయస్‌ అయ్యర్, ధనశ్రీ వర్మ డాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది.

Related posts