telugu navyamedia
తెలంగాణ వార్తలు

బాస‌ర‌లో పోటేత్తిన భ‌క్తులు..

శ్రీ శారదియ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా బాసరలో భక్తులతో కిటకిటలాడుతుంది. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆరవ రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

మూల నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు రాత్రి 12 గంటలనుంచే భక్తులు క్యూలైన్లలో అమ్మ వారి దర్శనం కోసం బారులు తీరారు. ఉదయం 3 గంటలకే పూజా కార్యక్రమాలు ప్రారంభమవగా.. భక్తులు గోదావరిలో పవిత్ర స్థానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. 

ఆలయ వేదమూర్తులు ఉదయం 11 గంటలకు మూలా నక్షత్ర సరస్వతి పూజ నిర్వహించనున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

ఇదిలాఉంటే.. మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో ఆలయంలో చిన్నారులకు పెద్ద ఎత్తున అక్షరాభ్యస కార్యక్రమాలు చేస్తున్నారు. ఆలయ ప్రాంగాణంలోని నాలుగు మండపాల్లో అక్షరాభ్యాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అమ్మవారి దర్శనం కోసం మూడు క్యూలైన్లలో భక్తులు వేచి ఉండగా.. దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.

Related posts