telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

లక్ష మందికి కరోన పరీక్షలు.. ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం

kejriwal on his campaign in ap

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 523 మందికి కరోనా పాజిటివ్‌ నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నగరంలో లక్ష మందికి కోవిడ్‌ 19 పరీక్షలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కడైతే పాజిటివ్‌ కేసులు వచ్చాయో ఆయా ప్రాంతాల్లో ప్రతీ రోజు సర్వే నిర్వహించాలని సూచింది.

అనుమానితులకు తప్పని సరిగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నిర్వహించే మీడియా సమావేశంలో ఐదు పాయింట్ల ప్రణాళికను వివరించనున్నారు. దేశ వ్యాప్తంగా 4421 మందికి పాజిటివ్‌ రాగా, 325 మంది చికిత్స పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్‌ అయ్యారు. వైరస్‌ బారిన పడి ఇప్పటికే 114 మంది మృతి చెందారు.

Related posts