telugu navyamedia
రాజకీయ

కొత్త కోవిడ్ వేరియంట్ పై మోదీకి కేజ్రీవాల్ లేఖ..

కొత్త వేరియంట్‌ కరోనా వైరస్ బారిన పడిన దేశాల నుండి భారతదేశానికి వచ్చే విమానాలను తక్షణమే ఆపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ విష‌యంలో ఏ మాత్రం ఆల‌స్యం చేసినా ప‌రిస్థితి చేయిదాటిపోయి ప్ర‌మాద‌క‌రంగా మారే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

మన దేశం గత ఒకటిన్నర సంవత్సరాలుగా కరోనాపై కఠినమైన పోరాటం చేసింది. చాలా కష్టంతో లక్షలాది మంది కోవిడ్ పై యుద్దం చేసి నిస్వార్థ సేవ కారణంగా, మన దేశం కరోనావైరస్ నుండి కోలుకుంది” అని లేఖలో రాశారు.

కొత్త కోవిడ్ వేరియంట్ దృష్ట్యా, యూరోపియన్ యూనియన్‌తో సహా అనేక దేశాలు ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణాన్ని నిలిపివేసాయి. తక్షణమే ఈ ప్రాంతాల నుండి విమానాలను నిలిపివేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. లేదంటే ఒమిక్రాన్ సోకిన ఒక్క వ్య‌క్తి దేశంలోకి వ‌చ్చినా ప‌రిస్థితి ప్ర‌మాద‌క‌రంగా మారుతుందని లేఖలో పేర్కొన్నారు

Image

Related posts