telugu navyamedia
క్రైమ్ వార్తలు

హైదరాబాద్ కూకట్ పల్లిలో వీకెండ్‌ రేవ్ పార్టీ కలకలం

హైదరాబాద్ న‌గ‌రంలోని కూకట్ పల్లి ప్రాంతంలో వీకెండ్‌ రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. మందు, విందు, యువతులతో కలిసి చిందేశారు. వివేకానందనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై పక్కా సమాచారంతో పోలీసుల దాడి చేసి.. 44 మంది యువకులతో పాటు యువకుల తో పాటు ఇద్దరు హిజ్రాలను కూడా అదుపులోకి తీసుకున్నారు.

పెద్ద మొత్తంలో మద్యం బాటిల్, కండోమ్ ప్యాకెట్లు ఈ దాడుల్లో స్వాధీనపరుచుకున్నారు. యువకులంతా కలిసి ప్రతి వీకెండ్లో పార్టీ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఘటనలో పట్టుబడ్డవారంతా హోమో సెక్స్‌వల్స్‌గా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పార్టీకి హాజరయ్యేందుకు అనుమతి కోసం.. ఇమ్రాన్, దయాల్ అనే నిర్వాహకులు ప్రతి వ్యక్తి నుంచి రూ .1000 రూపాయలు చెల్లించి యువకులు పార్టీ లో పాల్గొంటున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పార్టీలో పాల్గొన్న వారిలో పలువురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులకు తెలవకుండా యువకులు గే పార్టీలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

కూకట్ పల్లిలో రేవ్ పార్టీ భగ్నం.. ఇద్దరు హిజ్రాలతో పాటు? | police break up  a rave party in kukatpalli. police arrested those who went there and  organized the rave party.

పార్టీ జరుగుతున్న ఫ్లాట్ నుంచి 2 హుక్కా పాట్లు,3 హుక్కా ఫ్లేవర్లు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిర్వాహకుల పై నిషేధిత హుక్కా వినియోగం పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మిగిలిన యువకుల పై కూడా ఇతర కేసులు నమోదు చేశారు.

పార్టీ పేరుతో అధిక శబ్దంతో సౌండ్ సిస్టమ్ ను ప్లే చేస్తూ.. స్థానికులకు ఇబ్బందిని కలుగజేయడంతో వారు ఫిర్యాదు అందడంతో పోలీసులు రైడ్ నిర్వహించారు.

Related posts