చెన్నై సూపర్ కింగ్స్ కి ఢిల్లీ క్యాపిటల్స్ షాక్ ఇచ్చింది. చెన్నైతో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచులో ఢిల్లీ అదరగొట్టింది. 180 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించి శభాష్ అనిపించింది. ఢిల్లీ ఓపెనర్ ధవన్ సెంచరీ తో దుమ్ములేపాడు. 58 బంతుల్లో 101 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ని గెలిపించాడు. ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా..అక్షర్ పటేల్ 3 సిక్సర్లు కొట్టాడు. చెన్నై బౌలర్లలో చాహర్ 2 , కరణ్ ఠాకూర్, బ్రావో చెరో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణిత 20 ఓవర్లు ముగిసే సరికి 179 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ కి 180 లక్ష్యాన్ని విధించింది. డుప్లిసిస్ 58 .. అర్ధ సెంచరీకి తోడు అంబటి రాయుడు 45, రవీంద్ర జడేజా 33 తో చెలరేగారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఎన్రిచ్ 2 వికెట్లు తీయగా దేశ్ పాండే, రబడా చెరో వికెట్ పడగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్ ని కట్టడి చేయడంలో చేతులెత్తేసిన చెన్నై సూపర్ కింగ్స్ మళ్ళీ ఓటమిపాలైంది.
previous post


థూ.. దీనమ్మా జీవితం… ఆంటీ ఏంటి ? : పూరీ