telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఈ ప్రియురాలు ప్రియుడికి ఎలా నరక చూపించిందో తెలిస్తే షాకే…!

Women

ఫ్లోరిడాకు చెందిన ఓ యువతి తన ప్రియుడి పట్ల ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బాయ్‌ఫ్రెండ్‌తో ఘర్షణకు దిగిన గర్ల్‌ఫ్రెండ్ అతడి వృషణాలను రక్తం కారేలా అదిమిపట్టింది. ఎలాగొలా ఆమె నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులకు సమాచారం అందించడంతో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే… ఈ నెల 4వ తేదీన ఓర్లాండోకు 70 మైళ్ల దూరంలోని హర్బర్ బీచ్‌ నుంచి ఓ యువకుడు పోలీసులకు ఫోన్ చేశాడు. ప్రియురాలు తనపై దాడికి పాల్పడిందని, తన పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పాడు. అతడి సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడి పరిస్థితి చూసి షాక్ అయ్యారు. ముఖం మొత్తం దెబ్బలతో రక్తసిక్తమై కనిపించింది. వెంటనే దానికి కారణమైన 21 ఏళ్ల కాటి లీ పిచ్‌ఫోర్డ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పిచ్‌ఫోర్డ్‌‌తో కలిసి బీచ్‌కు వచ్చిన తాను అక్కడ కొద్దిసేపు బాగానే ఎంజాయ్ చేశానని, ఆ తరువాత ఓ విషయమై తమ మధ్య తలెత్తిన ఘర్షణలో ప్రియురాలు తనను గాయపరిచినట్లు చెప్పాడు. మొదట కిందపడేసి తనపై కూర్చున్న ఆమె తనను ఊపిరాడకుండా చేసిందని, ఆపై తాను ప్రతిఘటించడంతో తన వృషణాలను పట్టుకుందని తెలిపాడు. తాను బాధతో విలవిలలాడినా వాటి నుంచి రక్తం వచ్చేలా అలాగే అదిమిపట్టిందని చెప్పుకొచ్చాడు. ఆమె నుంచి అతికష్టం మీద తప్పించుకుని పోలీసులకు సమాచారం అందించానన్నాడు. పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు పిచ్‌ఫోర్డ్‌ను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. వచ్చే నెలలో ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు.

Related posts