బిగ్‌బాస్ రియాలిటీ షోకు ప్రజల్లో ఆదరణ ఎంతగానో ఉంది. అందుకే పలు భాషలతో పాటు తెలుగులోనూ ఇది విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు తెలుగులో ఐదు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది.
అయితే బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన యూట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్ జశ్వంత్ లవ్ జర్నీకి పుల్‌స్టాప్ పడింది. బిగ్ బాస్ హౌస్‌లో సిరితో ఫ్రెండ్‌షిప్ మాత్రం మొదటికే మోసం తెచ్చింది. ఎందుకంటే షణ్నుకు ఆల్‌రెడీ గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునయన ఉంది. ..అటు సిరికి శ్రీహాన్‌తో నిశ్చితార్థం కూడా జరిగింది.
హౌస్‌లో వారు ప్రవర్తించే తీరు ఇటు ప్రేక్షకులతో పాటు అటు వాళ్ళ వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా నచ్చలేదు..షన్ను సిరి హన్మంత్‌తో సన్నిహితంగా ఉండటమే కాకుండా, సిరిని కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం కూడా ఆయనకు ఎఫెక్ట్ అయ్యింది.
ఇదిలా ఉండగా దీప్తి సునైనా, షణ్ముఖ్ ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాక దీప్తి అతడి కోసం సోషల్ మీడియాలో క్యాంపైన్ కూడా చేసింది.
ఎంత ట్రోలింగ్ జరిగినా షణ్నుకు అండ నిలబడింది.. చివరి వరకు షణ్ముఖ్ ని గెలిపించడానికి ప్రయత్నించింది. వీలైనన్ని ఎక్కువ ఓట్లు షణ్ముఖ్ కి పడేలా ప్రయత్నించింది. కానీ షణ్ముఖ్ రన్నరప్ తోనే సరిపెట్టుకున్నాడు. హౌస్‌లో షణ్ణు చేసినపనులే దీప్తిని చాలా బాధించాయని అంటున్నారు కొందరు..
అంతేకాకుండా ‘బిగ్ బాస్-5’ నుంచి షన్ను బయటకు వచ్చాక ఇద్దరూ బహిరంగంగా కనిపించకపోవడంతో బ్రేకప్ పుకార్లు తెరపైకి వచ్చాయి. దీప్తి సునైనా ఇన్‌స్టాగ్రామ్‌లో షన్నూని అన్‌ఫాలో చేసింది.
తాజాగా ఈ వార్తలు నిజమేనంటూ తెల్చే చేప్పింది దీప్తి.. ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్‌తో విడిపోతున్నట్లు అధికారికంగా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది దీప్తి. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.
“నా శ్రేయోభిలాషులు మరియు స్నేహితులందరికీ ఎంతో ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. నేను, షణ్ముఖ్ పరస్పరం మా వ్యక్తిగత జీవితాలలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఈ ఐదు సంవత్సరాలు మేము సంతోషంగా ఉన్నాం. ప్రేమ, ఎదుగుల సమయంలో మాలోని రాక్షాసులతో పోరాటం చాలా కష్టం. మీరందరు కోరుకున్నట్టే మేమిద్దరం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది చాలా కాలంగా జరుగుతుంది. కానీ సోషల్ మీడియాలో కనిపించినంత సులభంగా మాత్రం కాదు. మేమిద్దరం కలిసి ఉండేందుకు ప్రయత్నించాము.
కానీ జీవితానికి అవసరమైన వాటిని విస్మరించాం. మా మార్గాలు వేరని తెలుసుకున్నాం. అందుకే మా దారులలో వెళ్లేందుకు ఇద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీరు మాకు అండగా ఉండండి. అలాగే మా ప్రైవసీకి భంగం కలిగించరని కోరుకుంటున్నాం.” అంటూ సుదీర్ఘ పోస్ట్ చేసింది దీప్తి సునయన.