telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇస్మార్ట్ శంకర్ : యూట్యూబ్ లో “దిమాక్ ఖరాబ్” చేస్తున్న వీడియో సాంగ్

Ismart-Shankar

పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుద‌లైంది. స‌క్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతూ రామ్ కెరీర్‌లో తొలిసారి 40 కోట్ల షేర్‌కు చేరువగా వచ్చిన సినిమా ఇది. 11 ఏళ్లుగా సరైన బ్లాక్ బస్టర్ లేని పూరీకి ఈ చిత్రం నిర్మాతగా, దర్శకుడిగా మంచి లాభాలని తీసుకొచ్చింది. ఇక రామ్ కూడా అంతే. చాలా ఏళ్ళ తర్వాత అసలైన బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కాగా.. తాజాగా ఈ సినిమా నుంచి “దిమాక్ ఖరాబ్” సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. నిధి అగర్వాల్, నభా నటాషా అందాల ఆరబోతతో ఈ పాట మాస్‌కు పిచ్చెక్కించింది. విడుదలైన క్షణం నుంచి యూట్యూబ్‌లో సంచలనాలు రేపుతోంది. ఈ వీడియో సాంగ్ రిలీజైనప్పటి నుంచి ఇప్పటి వరకు కోటి వ్యూస్‌ను దక్కించుకుంది. కేవలం మూడు రోజుల్లోనే కోటి వ్యూస్ దక్కించుకొని రికార్డు సృష్టించడంతో చిత్ర బృందం హ్యాపీగా ఫీల్ అవుతోంది. మీరు కూడా ఈ వీడియో సాంగ్ ను వీక్షించండి.

Related posts