telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్ 5, ఆదివారం రాశి ఫలాలు..

మేష రాశి..

మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. చేపట్టిన పనులల్లో విజయం సొంతం చేసుకుంటారు. స్థిరాస్తుల విషయంలో వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభ రాశి..

బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆలయ దర్శనాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు కలుగుతాయి.

మిధున రాశి..

ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కొత్త ఇల్లు కొనుగోలు విషయంపై ఆసక్తిని చూపిస్తారు. స్థిరాస్తి విషయంలో సమస్యలు పరిష్కారమవుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవ దర్శనం చేసుకుంటారు. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.

కర్కాటక రాశి

ఉద్యోగులకు విశ్రాంతి లభిస్తుంది. వ్యాపారాలు వృద్ధి అవుతాయి. రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదా పడుట వల్ల ఆందోళనకు గురౌతారు. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో క‌లుసుకుంటారు.

సింహ రాశి..

విద్యార్థులు విజయాన్ని అందుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. బంధు మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ధనాభివృద్ధి ఉంటుంది. విదేశీ చదువులు, నిరుద్యోగులు ఉద్యోగయత్నం స‌ఫ‌లం అవుతాయి. దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు.

కన్య రాశి..

విద్యార్థులకు స్నేహ సంబంధాలు బలపడతాయి. రహస్యాలు దాచి పెట్టలేని బలహీనత ఇబ్బందులకు దారితీస్తుంది. ఆర్ధిక పరిస్థితి ఆందోళన కరంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు విచారిస్తారు. కొత్తపనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల రాశి..

వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒప్పందాలు వాయిదా పడే అవకాశం ఉంది. ఋణప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు, మిత్రులతో జాగ్రత్త మెలగడం మంచిది.

వృశ్చిక రాశి..

కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వాయిదా వేసిన పనులను పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. వ్యవసాయ లాభాలను అందుకుంటారు. ప్రయత్నాలు సఫలమవుతాయి. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికం అవుతాయి.

ధనస్సు రాశి..

స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. కొన్ని విషయాలు చూసీ చూడనట్టుగా పోవాలి. స‌మాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. మానసిక ఆందోళన నెలకొంటుంది. బంధు మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. దైవ కార్యాల‌లో పాల్గొంటారు.

మకర రాశి..

వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. దైవకార్యాలకు ధనం బాగా వెచ్చిస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికీ అభివృద్ధి ఉంటుంది. ప్రయాణాలు అధికంగా చేస్తారు. స్త్రీవలన ధన లాభం పొందుతారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి.. ఆందోళన నెలకొంటుంది.

కుంభ రాశి..

విద్యార్థులకు కోరుకున్న అవకాశం లభిస్తుంది. ఆకస్మిక లాభం పొందుతారు. ఎటువంటి సమస్యనైనా నిబ్బరంగా ఎదుర్కుంటారు. స్త్రీలపై పొరుగువారి వ్యాఖ్యల ప్రభావం అధికం. చేపట్టిన పనుల్లో విజయం సొంతం చేసుకుంటారు. క్రీడాకారులకు , రాజకీయ రంగంలోనివారు మంచి అవకాశాలను అందుకుంటారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది.

మీన రాశి..

అవసరానికి తగిన సహకారం అందుకుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాల వలన ధన వ్యయం అధికంగా ఉంటుంది. అనారోగ్యం ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్ణయాలలో మార్పులు వ‌స్తాయి. సోదరుల నుంచి ఒత్తిడులు ఏర్ప‌డ‌తాయి. ఆలయాలు సందర్శిస్తారు.

Related posts